
Ex MP Ramesh Rathod Passes away
Ex MP Ramesh Rathod Passes away : ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేశ్ శనివారం కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఉట్నూరులోని తన నివాసంలో బ్లడ్ ప్రెషర్ తో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యలు ఆయనను వెంటనే ఆదిలాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మార్గమధ్యంలోనే కోమాకు వెళ్లి చివరి శ్వాస విడిచారు. రమేశ్ రాథోడ్ కొంతకాలంగా అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో చికిత్స కూడా పొందారు.
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన రాథోడ్ రమేశ్ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా, పార్లమెంట్ సభ్యునిగా సేవలందించారు. రాథోడ్ రమేశ్ భార్య సుమన్ రాథోడ్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేశ్ రాథోడ్ మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.