Babu Mohan: సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఆయన అసంతృప్తికి గురై పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. బిజెపి స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు చేశారు. గత కొంతకాలంగా బిజేపి నాయకులు తనను మానసిక క్షోభకు గురిచేశారని అందుకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయాన్ని తీసుకునని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బిజెపి పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరం అని పొమ్మనకుండా పొగ పెడుతున్నారని బాబుమోహన్ ఆరోపించారు.. బిజెపి పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేసిన నన్ను ఏ బి సి డి సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి క్యాటగిరిగా నిర్ణయించడానికి వీరికి ఏమీ అధికారం ఉంది.
సరాసరి నన్ను అవమానించడానికే రాష్ట్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకున్నారని అర్థమైంది. ఎప్పటికైనావరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందిం చాలని నేను నిర్ణయించుకున్నాను. అసెంబ్లీ ఎన్నికల నాటినుండి నన్ను దూరం పెడుతూ నా ఫోన్ సైతం ఎత్తకుండా బిజెపి దద్దమ్మ సన్నాసి నాయకులునన్ను ఇబ్బంది పెడుతున్నారు.అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్తీవ్ర ఆవేదనకు గురయ్యారు.