Kcr Discharged:య‌శోద హాస్పిట‌ల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్‌

 

Kcr Discharged:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించి ప్ర‌భుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం అయిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఫామ్ హౌస్‌లోని బాత్రూమ్‌లో జారిప‌డిన కేసీఆర్ య‌శోద ఆసుప‌త్రిలో తుంటి ఎముక‌కు చికిత్స చేయించుకున్నారు. స‌ర్జరీ నుంచి కోలుకున్న కేసీఆర్ శుక్ర‌వారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన ఆయ‌న బంజారాహిల్స్‌లోని నందీ న‌గ‌ర్‌లోని ఆయ‌న పూర్వ‌నివాసానికి వెళ్లారు.

కొన్ని రోజుల పాటు కేసీఆర్ అక్క‌డే ఉండ‌నున్నారు. స‌ర్జీకి సంబంధించి డాక్ట‌ర్ల‌కు అందుబాటులో ఉండాల‌న్న కార‌ణంతోనే కేసీఆర్ గ‌జ్వేల్‌..ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫామ్ హౌస్‌కు వెళ్ల‌కుండా నందీన‌గ‌ర్‌లోని త‌న పాత నివాసానికే వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. సీఎం అయ్యాక నందీన‌గ‌ర్‌లోని త‌న పాత నివాసాన్ని వీడి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లిన కేసీఆర్, ఆయ‌న కుటుంబం గ‌త తొమ్మిదేళ్లుగా ఈ నివాసానికి దూరంగా ఉంటూ వ‌చ్చింది. తొమ్మిదేళ్ల విరామం త‌రువాత కేసీఆర్ నందీన‌గ‌ర్‌లోని సొంత ఇంటికి చేరుకున్నారు.

కొంత కాలం పాటు అక్క‌డే ఉండ‌నున్నారు. నందీన‌గ‌ర్‌లో కేసీఆర్ త‌న ఇంటిని 2000 సంవ‌త్స‌రంలో నిర్మించారు. 2021లో ఇంటి మ‌ర‌మ్మ‌త్తుల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో కేసీఆర్ ఈ ఇంటి నుంచే కార్య‌చ‌ర‌ణ రూపొందించారు. తొమ్మిదేళ్ల విరామం అనంత‌రం కేసీఆర్ మ‌ళ్లీ సొంత ఇంటికి రావ‌డంతో పూల‌దండ‌ల‌తో ఇంటిని అలంక‌రించిన కుటుంబ స‌భ్యులు ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం విశేషం.

TAGS