Jagan:ఉత్తరాంధ్ర లో ఓట్లు కోసం జగన్ దొంగ నాటకానికి తెర తీశారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెరతీసారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణ స్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పడం నిరంకుశత్వానికి తారకానమని ఆయన అన్నారు.జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులను జగన్ నట్టేటముంచారని ఆరోపించారు. కర్నూల్ లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా వ్రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు కొనసాగుతున్న వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.