కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బిజెపి, జెడిఎస్ నుంచి ఒక్కో వ్యక్తి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బిజెపి- జె డిఎస్ కు 85 మంది సభ్యులు ఉన్నారు. న లు గురు స్వతంత్రులు ఉండగా, ఒక్కో అభ్యర్థికి 45 ఓట్లు కావాలి.
క్రాస్ ఓటింగ్ భయంతో కాంగ్రెస్ ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను హోటల్ తరలించింది. క్రాస్ వోటింగ్ పాల్పడే అవకాశం కనబడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిజెపి పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ కొనుగో లు చేసి తమ వైపు తిప్పుకుం టుందో అన్న భయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది.