Bitten by a Pet Dog : పెంపుడు కుక్క కాటుకు తండ్రీకొడుకులు మృతి

Bitten by a Pet Dog Father and son Died
Bitten by a Pet Dog : పెంపుడు కరవడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని నరసింగరావు (59), కుమారుడు భార్గవ్ (27)ను వారం రోజుల క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది.
వారిని కరిచిన రెండు రోజుల తర్వాత కుక్క చనిపోయింది. దీంతో వారు అప్రమత్తమై వెంటనే ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.