KCR:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారు జామున 2:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ ప్రమాదానికి గురైనట్టుగా సమాచారం. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయనకు గాయాలైనట్లు తెలిసింది.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బాత్రూమ్‌లో జారి పడిపోవడం వల్ల ఆయన ఎడమకాలు తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అత్యధిక స్థానాల్లో ఓడిపోవడంతో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బిఆర్ ఎస్ ప్రభుత్వం గద్దెదిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన కేసీఆర్ గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.