
Minister Ponguleti Srinivas House ED Searches
Minister Ponguleti Srinivas : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హిమాయత్ సాగర్ లోని ఆయన ఫాంహౌస్, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి.