EC Serious : తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఈసీ సీరియస్

EC Serious
EC Serious : గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై గృహ నిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఎలాంటి ఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఇదెలా ఉండగా ఎన్నికల సమయంలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉదయం నుంచి రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.