Revanth : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రేపు (జూలై 31) గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే జిష్ణుదేవ్ నియామకం వెనక చక్రం తిప్పింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రస్తుతం పొలిటికల్, మీడియా సర్కిల్ లో ప్రస్తుతం తీవ్ర జరుగుతుంది.
గవర్నర్ గా ఎంపికైన తర్వాత జిష్ణుదేవ్ వర్మ ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ కాల్ చేసి చెప్పే వరకు తనకు గవర్నర్ పదవి వచ్చిందన్న విషయం తెలియదని చెప్పడమే ఈ చర్చకు కారణం. రేవంత్ కాంగ్రెస్ పార్టీ సీఎం, గవర్నర్లను ప్రధాన మంత్రి సిఫారసు చేస్తారు. ఆయన ఆమోదం మేరకు, రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఈ విషయం ప్రధానమంత్రి తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు తెలియాలి. లేదంటే ప్రస్తుతం త్రిపుర గవర్నర్ తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డికి తెలియాలి. కానీ అందరికంటే ముందు రేవంత్ కు ఎలా తెలిసింది..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ స్థాయిలో సీఎం గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నాడా..? లేక బీజేపీ పెద్దలు ముందే తెలిపారా..? అని భావిస్తున్నారు.
త్రిపురలోని రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమంలో 1990లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాడు. 2018లో త్రిపురలోని చరిలం శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉప సీఎంగా పనిచేశాడు. ఇటీవల ఎన్నికల్లో అదే శాసన సభ స్థానం నుంచి త్రిపుర మొహత పార్టీ అభ్యర్థి సుబోద్ దేబ్ బర్మ చేతిలో ఓటమి చవిచూశాడు.