Edupayala: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా:  మాఘ అమావాస్య సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మన దుర్గ భవాని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంజీరా నదిలో స్నానాలు చేసి భక్తులు  అమ్మవారిని దర్శిం చుకుం టున్నారు.  ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అర్చకులు మాఘ అమావాస్య రోజున నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుం దని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు.

మెదక్ జిల్లా ప్రధాన పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయల మన దుర్గ భవాని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.  తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయం కు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాఘ అమావాస్య సందర్బంగా  భక్తులు ఆలయం కు చేరుకొని మంజీరా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

TAGS