JAISW News Telugu

Gaza-war : గాజాలో దుర్బర పరిస్థితులు..ఆహారం లేక అలుమటిస్తున్న చిన్నారులు..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధo నేపథ్యంలో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీరు ఆహారం ఔషధాల కొరత తీ వ్రంగా ఏర్పడింది. తినడానికి తిండి లేక కలుపు మొక్కలను తింటున్నారు. చిన్నారులకు కూడా వాటిని తినిపిస్తున్నారు. స్థా నికంగా పెరిగే మాలో మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నారు.

కాగా యుద్ధం కారణంగా ఇప్పటివరకు గాజాలో 23 లక్షల మందిలో దాదాపుగా 80 శాతం మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్లి రఫా నగరంలో తలదాచుకుంటున్నారు. ఇంత దుర్భరమైన పరిస్థితులు అక్కడ ఉన్న యుద్ధం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉం ది. ఆహారం లేక చిన్నపిల్లలు అలమటిస్తున్నారు. చిన్నారులు ఇంత ఇబ్బంది పడుతున్న ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలతో మిగిలితే చాలు అని అనుకుంటున్నారు.

Exit mobile version