Tadepalli CI Kalyanaraju : అప్పు ఎగవేతకు ఓ వ్యక్తి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. సినీ ఫక్కీలో మోసం చేసేందుకు యత్నించి దొరికిపోయిన ఈ విషయాన్ని తాడేపల్లి సీఐ వెల్లడించారు.
అప్పు ఎగవేతకు గుర్రంకొండ రాము అనే వ్యక్తి నకిలీ బంగారంతో సినీ పక్కిలో దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సీఐ కల్యాణరాజు తెలిపారు. ఫిర్యాదు దారుడైన వీరాంజనేయులుకు నిందితుడు రాము రూ.90 లక్షల నగదు ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతో ఎలాగైనా అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచనతో ప్లాన్ వేశాడు.
నగదుకు బదులు బంగారం ఇస్తానని వీరాంజనేయులును నమ్మించాడు. బయటకు తీసుకొనివెళ్లి రూ.90 వేల విలువైన బంగారం అప్పగించాడు. ఆ తర్వాత వీరాంజనేయులు ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాము తన మనుషులతో దొంగతనం చేపించాడు. దీంతో వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో రాము వేసిన ప్లాన్ బయటపడడంతో రామును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కల్యాణరాజు వివరించారు.