ఐపిఎల్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డారిలో మిచెల్ గాయపడ్డారు. దక్షిణాఫ్రికా తో రెండో టెస్ట్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కాలి బొటన వేలుకు గాయమైంది. అది తీవ్రతరం కావడంతో మిచెల్ కు న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డ్ రెస్ట్ఇచ్చారు. ఆల్ రౌండర్ వేలంలో మిచెల్ కు సిఎస్ కె రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గాయమవడం అందోళన కలిగిస్తోంది.14 కోట్లకు కోనుగోలు చేసిన సిఎస్కే సంస్థ మిచెల్ ఎప్పుడు కోలుకుంటాడో నన్న అయోమంలో పడింది. ఆల్ రౌండర్ గా స్టార్ గా ఉన్న మిచెల్ కు ఇలా హటాత్తుగా గాయం అయిన నేపద్యంలో అతను క్రికెట్ ను ఆడలేని పరిస్థితి నెలకోంది. కాలి బొటనవేలు కు తీవ్రగాయం కావడం వల్ల అతను క్రికెట్ ఆడటం అంత సేఫ్ కాదని బావించిన న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు మిచెల్ కు కొద్దిరోజుల పాటు రెస్ట్ ఇచ్చింది.