తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకోంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న 64,635 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు..19,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చింది. మెత్తం మీద శ్రీవారి దర్శనానికి సుమారుగా 6 గంటలకు పైగా సమయం పడుతుం డటంతో భక్తులు కంపార్టు మెంట్లలో బారులు తీరారు. గడిచిన వారం రోజుల నుంచి తిరుమల కు భక్తుల తాకిడి మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. భక్తులు తాకిడి తోనే శ్రీవారి దర్శనం బాగా లేటు అవుతుందని తెలిపారు.