Congress CLP Meeting:తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిసి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు భారీ మెజారిటీని అందించిన విషయం తెలిసిందే. అదికార భారాస 39 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్‌ని అలవోకగా అధిగమించి రాష్ట్రం మొత్తం మీద 64 సీట్లని దక్కించుకుంది. కాంగ్రెస్ అధికరాం చేపట్టడం ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు సీఎం అవుతారు అన్నది ఉత్కంఠగా మారింది.
ఇప్పటికే పలువురు సీనియర్లు సీఎం రేసులో నేనున్నానంటే నేనున్నానంటూ ప్రకటించిన నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఎవరిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. డీకే శివకుమార్‌తో పాటు పార్టీ కీలక నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతా ఏక వాక్య తీర్మాణానికి అంగీకరించారు. అదిష్టానం ఎవరిని నియమిస్తే వారికి కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అదిష్టానం కూడా రేవంత్ రెడ్డి నే సీఎల్పీ నేతగా ప్రకటించాలని భావిస్తోందట. ఢీకె శివకుమార్ ఈ నిర్ణయాన్ని అదిష్టానంతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు. మరి కాసేపట్లోనే సీఎం అభ్యర్థి ఎవరనే దానికి తెర పడనుందని తెలుస్తోంది. ప్రకటన వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరాం చేసే అవకాశం ఉంది.