Congress Manifesto 2023 Release Today : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కేవలం మరో పదకొండు రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటికే పార్టీలన్నీ గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తు్న్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ తన మ్యానిఫెస్టో ప్రకటించగా, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ఇప్పటివరకు ప్రచారపర్వాన్ని కొనసాగించింది. ఇక శుక్రవారం ఆ పార్టీ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ మ్యానిఫెస్టో ప్రకటన కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. పలు రంగాల నిపుణులను సంప్రదించాకే, మ్యానిఫెస్టో రూపకల్పన కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ మ్యానిఫెస్టో పై పూర్తి స్థాయి చర్చ జరగుతున్నది మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వివిధ వర్గాలను కలిసి ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ. 25000 పింఛన్ సహా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా ఉద్యమకారులపై కేసులు పూర్తిగా ఎత్తివేసి 250 గజాల ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పబోతున్నారు. అదేవిధంగా రూ. 2 లక్షల పంట రుణమాఫీతో పాటు రూ. 3లక్షల వరకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించబోతున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కొనసాగింపు, ధరణి స్థానంలో భూమత పోర్టల్ ప్రవేశపెట్టి భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పబోతున్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి, అవకతవకల ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపినట్లు సమాచారం. దీంతో పాటు పలు కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు సమాచారం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు, పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ, సింగరేణిలో కారుణ్య నియామకాల మీద కూడా పున:పరిశీలన, మెరుగైన వైద్య సేవల కల్పన, ఆడపిల్లలు, మహిళలను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని పథకాలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండేలా మరికొ న్ని హామీలు ఇవ్వబోతు న్నట్లు తెలుస్తు్న్నది దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కూడా ఓ కీల హామీ రాబోతున్నట్లు సమాచారం.