తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లి సూచనల మేరకు 5 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు రూ./1,00,000/- విలువ చేసే 2టిఫిన్ బండి,1ఇస్త్రీ బండి, 2 తోపుడు బండ్లును దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బండ్లను వారికి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఉచితంగా అందజేశారు. ఆంధ్ర అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి నాయకులకు లేదని రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీనేనని అనినాష్ అరోపించారు.
విభజన హామీలు పొందుపరచటంలో విఫలమైంది కాంగ్రెస్ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎడారిలో ఓయాసిస్ లాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి చేయడంలో జగన్ ప్రభుత్వం సఫలమైందని సంక్షేమ పథకాలు అందించ డంలో దేశంలోనే జగన్ ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉందని ఆయన అన్నారు.
ఈ పర్యటనలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక గారు,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు గారు,19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నాహీద్ గారు కో అప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్ గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంఛార్జీలు,సోషల్ మీడియా మిత్రలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.