Big Shock-Congress : హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో 68 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34 పడిపో యింది. ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి బలం కూడా 34 కి చేరింది.
ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు ఇవాళ గవర్నర్ ను కలిశారు. అధికారంలో ఉండే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని బిజెపి నేత జయరాం ఠాగూర్ తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా లపై బిజెపి కుట్ర చేసి తాము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బిజెపి పార్టీకి సొంతంగా అధికార పగ్గాలు చేపట్టే దమ్ము ధైర్యం లేదని అడ్డదారిలో ఎమ్మె ల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.