వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం గా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో క్రికెట్ ఆటలో గెలుపొంది బహుమతులు పొందిన తూర్పు నియోజకవర్గ క్రికెట్ జట్టుకు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అభినందనలు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన క్రీడాకారులు అవినాష్ ను కలువగా ఆయన వారందరిని శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహకం అందించి వారిని జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొనేలా సహకారం అందిస్తుంది అని తెలిపారు.