JAISW News Telugu

Nominated Posts: తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల కోసం పోటీ..ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్న..రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : బీఆర్​ఎస్​ను గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ  నామినేటెడ్‌ పోస్టులపై దృష్టి సారించింది. పార్టీ కోసం కష్టపడిన వారితో పాటు ఎన్నికల్లో టికెట్‌ త్యాగం చేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకత్వం నిర్ణయించింది. శాసనసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యి మందికి పైగా కాంగ్రెస్‌ నాయకులు దరఖాస్తు చేసుకోగా సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసినందున చాలా మంది సీనియర్లకు సైతం టికెట్లు దక్కలేదు. పార్టీ ఫ్రంట్‌ ఆర్గనైజేషన్స్‌లో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు మినహా, ఎవరికీ టికెట్లు దక్కలేదు.  టికెట్ దక్కని వారితో  కమిటి భేటీలు నిర్వహించి టికెట్లు ద క్కని వారికి  ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయంతో టికెట్లు దక్కని వారి చూపు నామి నేటెడ్‌ పోస్టులపై పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రసన్నం చేసుకుని పదవులు దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, ప్రోటోకాల్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌రావు తదితరులు నామినేటెడ్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, భవానీరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌ రెడ్డితో పాటు చిలుక మధుసూధన్‌రెడ్డి, కైలాశ్‌నేత, చారకొండ వెంకటేశ్‌, లోకేశ్‌ యాదవ్‌, మీడియా కో-ఆర్డినేటర్లుగా పనిచేసిన బురకా వచన్‌కుమార్‌, కె.శ్రీకాంత్‌ యాదవ్‌ ప్రధానంగా నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు.

Exit mobile version