Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం తొలి సారి సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌కు చేరుకున్నారు. తన కాన్వాయ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ ఇవ్వడం అక్కడున్న ఆయన అభిమాలని విశేషంగా ఆకర్షించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. మరి కాపేపట్లో జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభం కాబోతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే ప్రజాభవన్‌లో శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్ ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇందులో పాల్గొనడం కోసం తెలంగాణ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజాభవన్‌కు చేరుకున్నారు.
చాలా మంది తమ వినతులతో ప్రజాభవన్‌కు చేరుకుంటున్నారు. దీంతో ప్రజాభవన్ పరిసరాల్లో భారీగా జనసందోహం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలి వస్తున్నారు. తమ సమస్యలని సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.కొండంత ఆశతో కొత్త సీఎం మా సమస్యలు తీసుస్తారని భారీగా జనం వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రజాదర్బార్ ప్రారంభం కానుంది. ప్రాంభమైన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు.