CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగసభలో కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి హాజరై ఎన్నికల శంఖారావం పూరించను న్నా రు. సీఎం రేవంత్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30కి కేస్లాపూర్‌కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి,నాగోబా దేవస్థాన గోపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్స కార్య క్రమాల్లో పాల్గోం టారు.. నాగోబా నుంచి రోడ్డుమార్గాన ఇంద్రవెల్లి సభకు మంత్రులు,ముఖ్యమంత్రి చేరుకుంటారు. పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుంచే ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపద్యంలో ఇంద్రవల్లిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయుకులు కూడా హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించారో అదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో కూడూ అన్నీ ఎంపీ స్థానాలను గెలిపించాలని ముఖ్యంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నారు.