CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగం పేట విమానాశ్రయం నుంచి ఝార్ఖండ్ లోని రాంచీకి బయలు దేరి వెళ్లారు. ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర లో పాల్గోనేందుకు సిఎం రేవంత్ అక్కడికి వెళ్లారు. సిఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటి సి ఎం బట్టివిక్రమా ర్క, మం త్రులు పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నారు.
రాహుల్ గాంధీ దేశంలో ని పలు రాష్ట్రా ల్లో ఈ న్యాయ్ యాత్రను చేపట్టారు. ఈ సారి ఎలాగైన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయ త్నం చేస్తున్నారు. మెదటి విడతలో చే పట్టిన జోడో యాత్రల వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది. దీంతో రెండవ విడత యాత్ర చేస్తే కచ్చితంగా దేశంలో అధికారంల చేపట్ట వచ్చు అని రాహుల్ గాంధీ ఈ యాత్రను కోనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.