CID chief Sanjay : సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవు రద్దు చేసుకున్నారు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలపై తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధికారి సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఈరోజు (బుధవారం) నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటనే అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో సెలవును రద్దు చేసుకున్నట్లు సమాచారం.