Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

Choppadandi MLA Wife
Choppadandi MLA Wife : తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు.
చొప్పదండి ఎమ్మెల్యే సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.