Cheetah : మహానందిలో చిరుత.. ఆందోళనలో ప్రజలు

Cheetah
Cheetah : మహానందిలో మరోసారి చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు కూడా చిరుతను పట్టుకోరా అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అడవిలోని కృష్ణనందు క్షేత్రానికి వెళ్లే పాత రస్తా నుంచి 4.30 గంటలకు క్షేత్రంలోని గోశాల వద్ద చిరుత కొంతసేపు ఆగి రథమార్గం గుండా అడవిలోకి వెళ్లింది.
మహానందిలో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మహానందిలోని పార్వతీపురం, అరటితోటల్లో సంచరిస్తుండడంతో కోతులు, కుక్కలు విపరీతంగా అరవడాన్ని అక్కడి ప్రజలు గమనిస్తున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోక పోవడంపై స్థానికులు అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు.