ఏపి: తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు 9 సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 1978 లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. టిడిపి హవాలో 1983 లో ఓడిపోయారు. తర్వాత టిడిపి తీర్థం పుచ్చుకున్న ఆయన 1989 నుంచి కుప్పం బరి లో నిలిచారు. ఆ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు వరుసగా ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
వరుసగా ఎమ్మెల్యే గా ఎన్నికైన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు- చంద్రబాబు అంటే కుప్పం అన్న రీతిగా ఉంటుంది. ఎప్పుడు పోటీ చేసినా అక్కడ చంద్రబాబు నాయుడు విజయకేతనం ఎగరవేయడం ఖాయం అని తెలుస్తుంది. కానీ ఈ సారి ఎన్నికలు మాత్రం కాస్త బిన్నంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.