చంద్రబాబు ధనికుల పక్షపాతి అని కేశినేని సంచలన ఆరోపనలు చేశారు. విజయవాడ ఎంపీ సీటు ను చంద్రబాబు అమ్ముకున్నారని రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజల ను మోసం చంద్రబాబు మోసం చేశారని కేశినేని నాని అన్నారు. నేను లేకపోతే గద్దె రామ్మోహన్ జీకో అని 25 వేల ఓట్ల మెజార్టీతో దేవినేని అవినాష్ గెలవబోతున్నారని కేశినేని నాని తెలిపారు. ఏపి లోపోటీ చేసే చంద్రబాబుకు కనీసం ఈ రాష్ట్రంలో సోంత ఇల్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు ప్రజలను మోసం చేశాడని కేశినేని నాని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తున్నారన్న సంగతి ప్రజలకు అర్థం అయిందన్నారు. మాట ఇస్తే ఆమాట పై కట్టుబడి ఉండాలన్నారు. మీ స్వార్థం కోసం నేతల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని కేశినేని నాని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసిపి విజయ డంఖా మోగించబోతుందని ఆయన తెలిపారు.