Camel Theft : ఒంటెను ఎత్తుకెళ్లడం ఎంట్రా… మీరు మనుషులా.. మానవమృగలా..

Camel theft

Camel theft

Camel theft : రోజు రోజుకు దొంగల తీరు మారిపోతుంది.  మొన్నటి వరకు పర్సులు, నగలు, బంగారం కొట్టేయడం చూశాం. కానీ జంతువులను దొంగిలించడం చూశామా..  అన్నమయ్య జిల్లా కురబలకోట మండల కేంద్రం అంగళ్లులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బక్రీద్ పండగ సందర్భంగా తెచ్చుకున్న ఓంటెను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఏంటీ మతిపోయిందా.. ఓంటెను ఎత్తుకెళ్లిపోవడానికి అదేమైనా.. కుక్కనా.. పిల్ల ఎత్తుకుపోవడానికి అని విమర్శలు చేస్తుంటే.. నిజంగానే ఓంటెను ఎత్తుకెళ్లారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

అంగళ్లు గ్రామానికి చెందిన ముస్లింలు కొంతమంది కలిసి 13 రోజుల కిందట రూ.125 లక్షలతో ఒక ఒంటెను కొనుగోలు చేశారు. దాన్ని గ్రామ పరిసర ప్రాంతాల్లో మేపుతూ.. రాత్రి ఇంటి వద్ద కట్టేసుకునే వారు. తెల్లవారు జూమున లేచి చూసే సరికి ఒంటె కనిపించలేదు. దీంతో తాడు తెంపుకుని ఎటైనా వెళ్లిపోయిందేమోనని అంతటా వెతికి చూశారు. అయినా దాని జాడ కనిపించడం లేదు.

కనసానివారిపల్లె మీదుగా.. మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తీసుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కనిపించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు లాంటివి చోరీ చేయడం అంతా ఆషామాషీ కాదు. కష్టంతో కూడుకున్న పని. అయినా ఇది ఎవరో ఒకరు చేసిన దొంగతనం కాదు. చాలా మంది కలిసి చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒంటె దొరికితే సమాచారం చెప్పినా చాలు మంచి పారితోషికం ఇస్తామని చెబుతున్నారు.

ఇదెంట్రా ఒంటెను దొంగతనం చేయడం ఎంటనీ అందరూ నవ్వకుంటున్నారు. అదొక చిన్న జంతువు కాదు.. దాన్ని తీసుకెళ్లాలంటే పెద్ద వాహనం కావాలి. ఎవరూ ఎత్తుకెళ్లారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చుట్టు పక్కలా ప్రాంతాల్లో ఎక్కడా జరగలేవని.. ఇక్కడే జరగడంతో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా.. లేక ఒంటె తీసుకొచ్చిన సమాచారం తెలిసిన వ్యక్తులే ఇలా దొంగతనానికి పాల్పడ్డారా అనే సందేహం కలుగుతోంది. సంబరంగా పండగ చేసుకుందామంటే ఒంటె పోవడం ఎంట్రా అనుకుంటూ దిగాలు పడుతున్నారు.

TAGS