BRS:గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం..బీఆర్ఎస్ ఫైర్
BRS:బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా .మాజీ మంత్రి కడియం శ్రీహరి గవర్నర్ ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం లో కొత్తదనం ఏమీ లేదని, అభివృద్ధి కి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉందని ఆయన విమర్శించారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని విస్మరించారని, తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ నెంబర్ వన్ ,ఐటీ ఎగుమతుల్లోసాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారని, .తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదని కడియం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకుకున్నారని ఆయన రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదు అని, దళిత బంధు ప్రస్తావన లేదని కడియం మండిపడ్డారు.