JAISW News Telugu

Blood Clotting: కొవిడ్‌ టీకాతో గడ్డ కడుతున్న రక్తం.. తేల్చిన తాజా అధ్యయనం!

న్యూఢిలీ:  కొవిడ్‌ టీకాతో రక్తం గడ్డ కడుతుందని  తాజా అధ్యయనం తేల్చింది.  కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ తర్వాత వివిధ దేశాల్లో (భారత్ మినహా) టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు ,మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఓకటి తేల్చింది. కోవిడ్ -19 టీకా దుష్ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ వో)యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక డాటా సేకరించింది.

ద గ్లోబల్ కోవిడ్ సెఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో కోవిడ్ టీకాల పనితీరును మదింపు చేసింది. భారత్‌ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది పేషెంట్ల నుంచి డా టాను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్టు తెలిసింది.

ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయని గణాంకాలు చెబు తున్నాయి. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version