JAISW News Telugu

Pallavi Prashanth:బిగ్‌బాస్ విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కు 14 రోజుల రిమాండ్‌!

Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజ‌న్ 7 విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, అత‌ని సోద‌రుడు మ‌హావీర్‌కు నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఇటీవ‌ల జ‌రిగిన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో సామాన్యుడిగా ప్ర‌వేశించిన రైతుబిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఫైన‌ల్స్‌లో ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానులు పొంది విజేత‌గా నిలిచాడు. రూ.35 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు రూ.15 ల‌క్ష‌లు విలువ చేసి హారం, రూ.15 ల‌క్ష‌లు విలువ చేసే వితారా బ్రిజా కారుని బ‌హుమ‌తిగా ద‌క్కించుకున్నాడు.

అయితే ఆదివారం జ‌రిగిన గ్రాండ్ ఫినాలేలో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ని విజేత‌గా ప్ర‌క‌టించ‌డంతో ర‌న్న‌ర‌ప్ అమ‌ర్ దీప్ అభిమానులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. అయితే ఈ ఘ‌ర్ష‌ణ‌లో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అభిమానులు కూడా చేడం, అన్న‌పూర్ణ స్టూడియో స‌మీపంలోని ఆర్టీసీ బ‌స్సులు, కార్ల‌పై విధ్వంసం సృష్టించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదివారం జ‌రిగిన అల్ల‌ర్ల‌ని సుమోటోగా స్వీక‌రించిన జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్‌బాస్ విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ని ఏ1 ముద్దాయిగా తేలుస్తూ కేసు ఫైల్ చేసిన విష‌యం తెలిసిందే.

ప‌ల్ల‌వి ప్ర‌శాంత్, అత‌ని సోద‌రుడు మ‌హావీర్‌ల‌ కోసం గ‌జ్వేల్ మండ‌లం కొల్గూర్ లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. న‌గ‌రానికి త‌ర‌లించి గ‌త రాత్రి వారికి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ అనంత‌రం వీరిద్ద‌రికి నాంప‌ల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఇద్ద‌రిని జూబ్లీహిల్స్ పోలీసులు చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో మ‌రో నిందితుడు వినోద్ ప‌రారీలో ఉన్న‌ట్టుగా పోలీసులు తెలిపారు. ఆదివారం దాడిలో పాల్గొన్న మ‌రో 14 మందిని పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version