తెలంగాణ: లోక్ సభ ఎన్నికలు సమీపస్తులు నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంప తులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారిద్దరూ వారంలో జాయిన్ అవుతామని చెప్పారు. ఇక తొలినుంచి బిఆర్ఎస్ విధేయు లుగా ఉన్న హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసిద్దిన్ నిన్న హస్తం గుడికి చేరారు.
త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం అందుతోంది. ఆరుగ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలనను కొనసాగి స్తుంది. ఈ నేపధ్యం పలువురు బీఆర్ ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే అప్పుడే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి.