ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు.
తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15 వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తాం.
దీపం పథకం కింద పది కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
ప్రతి ఇంటికి కులాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా చేస్తాం.
అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం.
యువగళం నిధి క్రింద ప్రతినిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు ఇస్తాం.
బీసీల రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాల వారికి అండగా నిలుస్తాం.
పూర్ టు రిచ్ పథకం ద్వారా పేదలను సంపన్నులుగా మార్చే కార్యక్రమం కూడా చేస్తాము.