DK Aruna: రాజకీయాలు మానుకొని పాలమూరును అభివృద్ధి చేయండి: డీకే అరుణ
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రలో పాలమూరులో అన్ని సీట్లు బీజేపీవే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బిజెపి అధి కారం లో లేనప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం సుమారు 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.
2047 వరకు ఒక ముందస్తు ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. రాబోయే 23 ఏళ్లలో అనేక ప్రణాళికలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతామని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇ చ్చారని దీంతో రేవంత్ రెడ్డి బూరెల బుట్టలో పడ్డాడని, ఇక బుట్టిలో గారెలు తినుకుంటూ కూర్చోవద్దని ప్రజల మంచి చెడ్డలు చూడాలని ఆమె హితబోధ చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కెసిఆర్, రేవంత్ రెడ్డి ఒకే రకమైన విమర్శల గేమ్ ఆడుతున్నారని ఆమె అన్నారు. ఈ పొలిటికల్ డ్రామాలు ముందు బంద్ చేయాలని ఆమె సూచించారు. చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు.