Autos Strike : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అద్వానంగా మారిందని ఆటో డ్రైవర్లు గత కొద్ది రోజుల నుంచి ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిద రూపాల్లో ఆటో డ్రైవర్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహి ళ లకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి లేక వీధిన పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూట గడవక ఆత్మహ త్య లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. తక్షణమే ప్రభత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు 16 వ తారీకున ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ ఆటోల బంద్ తో నైన మా సమస్యకు ప్రభుత్వం పరి ష్కారం చూపిస్తుందని ఆటో డ్రైవర్లు ఆశి స్తున్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతో ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.