ఏపీ: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. నారాయణ స్కూల్లో పిఈటిగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గర్భవతి చేశాడు. మాయమాటలు చెప్పి లైంగికంగా దాడి చేశాడు.
కొద్ది రోజుల తర్వాత ఆ బాలికకు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిపై ఫోక్సొ యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు.