గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమ యంలో ప్రసాదంపాడు లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచా రణ కు కోర్టుకు హాజరు కావాలని పులుమార్లు తెలిపినా వంశీ హాజరు కాలేదు. ఇవాల్టి విచార ణకు కూడా హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ అమ లు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ వారెంట్ పై వంశీ ఇంత వరకు స్పందించలేదు.