Nara Lokesh:టీడీపీ నేత య‌ష్ అరెస్ట్‌..వైకాపాపై మండిప‌డిన లోకేష్‌

Nara Lokesh:టీడీపీ ఎన్ఆర్ఐ నేత య‌ష్ ను ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఏరియిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న అమెరికా నుంచి వ‌చ్చిన కొద్దిసేప‌టికే అరెస్ట్ చేసి మంగ‌ళ‌గిరికి త‌ర‌లించారు. అత‌డిపై లుకౌట్ నోటీసులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. అస్వ‌స్థ‌త‌కు గురైన త‌ల్లిని చూసేందుకు అమెరికా నుంచి వ‌చ్చిన య‌ష్‌ని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌ల‌కం సృష్టిస్తోంది.

దీనిపై టీడీపీ యువ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. య‌ష్ బొద్దులూరి అరెస్ట‌ణు ఆయ‌న‌తో పాటు టీడీపీ శ్రేణులు ఖండించాయి. య‌ష్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా గుంటూరు సీఐడీ కార్యాల‌యం ఆందోళ‌న‌కు దిగాయి. అంతే కాకుండా వైకాపా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. `ఉగ్ర‌వాదిని హింసించిన‌ట్టు య‌ష్‌తో సీఐడీ వ్య‌వ‌హ‌రించ‌డం దుర్మార్గ‌మ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు. య‌ష్ అరెస్ట్‌ను ఖండిస్తున్నా..ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ను నిర్భందాల ద్వారా అణ‌చివేయాల‌ని వైకాపా ప్ర‌భుత్వం అనుకుంటోంది.

మాకు న్యాయం జ‌రిగే వర‌కు విశ్ర‌మించ‌బోము. వైకాపాకు చివ‌రి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి` అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. య‌ష్‌ను అరెస్ట్ చేయ‌డం సైకోయిజానికి నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ సీనియ‌ర్ నేత ల‌చ్చెన్నాయుడు మ‌డిప‌డ్డారు. య‌ష్ భ‌ద్ర‌త‌పై ముఖ్య‌మంత్రి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ప్ర‌భుత్వ త‌ప్పులు, అవినీతిని ప్ర‌శ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్ర‌శ్నించారు. స్వేచ్ఛ‌గా అభిప్రాయాన్ని వెల్ల‌డించే హ‌క్కు లేదా? జ‌గ‌న్ నియంతృత్వ‌పోక‌డ‌ల‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్పదు` అని మండిప‌డ్డారు.

TAGS