శ్రీశైలంలో తెలంగాణ మద్యం ను పోలీసులు పట్టుకున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటవ తేది నుంచి జరుగనున్న నేప థ్యం లో శ్రీశైలం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణకు చెందిన ఓ మహిళ అ క్ర మ తెలంగాణ మద్యం విక్రయించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం బాటిళ్లు భారీగా గుట్టు చప్పుడు కాకుండా శ్రీశైలంలో డంపు చేసుకుంది.
పక్క సమాచారం అందుకున్న శ్రీశైలం సిఐ ప్రసాదరావు ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి తెలంగాణకు చెందిన అక్రమ మద్యం మాటిళ్లను పట్టుకుని స్వాదీనం చేసుకున్నారు . తెలంగాణ మద్యం 166 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని అక్రమ మద్యం శ్రీశైలానికి తీసుకువచ్చిన మహీళను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ప్రసాదరావు మీడియాకు వివరించారు.
పట్టుబడిన మద్యం బాటిళ్లు వివిధ రకాల బ్రాండ్లు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి కోర్టు హజరుపరుస్తున్నామని సిఐ తెలిపారు. అయితే శ్రీశైలం మహాక్షేత్రం పరిధిలో మద్యం మాంసం విక్రయాలు నిషేధమని ఎంతటి వారైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు