Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్ట్
AP: కోడి కత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలను మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.ఇలాంటి నిబంధనలు పెడుతూ శ్రీనివాసరావుకు షరతుల కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. హైకోర్టు తీర్పు పై దళిత పౌర సంఘాలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ఐదేళ్లుగా జైలులో నిందితుడు గా జనపల్లి శ్రీనివాసరావు మగ్గుతున్నారు. అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఏపీ సిఎం జగన్ పై ఎన్ని కల కంటే ముందు శ్రీని కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్రీను అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తన కుమారున్న అనవసరం గా జైల్లో పెట్టి హింసిస్తున్నారని శ్రీను తల్లి,దండ్రులు దశిత సంఘాల నాయుకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో కోడి కత్తి శ్రీను కు ఈ రోజు అనూహ్యంగా హైకోర్టు తీర్పునిచ్చింది.