AP assembly: నేటి నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..పలు శాఖల నివేధికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం
అమరావతి: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పారంభం కానున్నాయి. పలు శాఖలకు సంబంధించిన నివేదికలను రాష్ట్రప్రభుత్వం సభ ముందు పెట్ట బోతుంది. మెదట గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుం ది.. అనంతరం సీఎం జగన్ సమాధానం ఇవ్వబోతున్నారు. సభలో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024 తో పాటు ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 ప్రవేశపెట్టబోతుంది.