JAISW News Telugu

Vemireddy-TDP: వైసిపికి మరో షాక్…రాజీనామ చేసిన వేమిరెడ్డి సురేందర్ రెడ్డి..టిడిపిలో చేరిక?

Facebook
X
Linkedin
Whatsapp

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. దేవర పాలెం ఉప సర్పంచ్ వేదగిరి నర సింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా ఉన్న వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కోటంరెడ్డి సోదరులు టిడిపిలో చేరిన తర్వాత తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటివరకు కొనసాగానని కానీ అక్కడ అడుగడుగున అవమా నాలు ఎదురయ్యాయని కనీసం గుర్తింపు లేదన్నారు.

అవమానాలు జరిగే చోట ఉండలేక కోటంరెడ్డి సోదరుల నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని అలాగే తనతో పాటు వార్డు మెంబర్లు కూడా ఈనెల 14న టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు. దేవరపాలెంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు.

Exit mobile version