Shiva and Nandi : శ్రీశైలంలో తవ్వకాల్లో బయటపడిన మరో శివుడు, నంది విగ్రహాలు

Shiva and Nandi
Shiva and Nandi : భ్రమరాంబ సమేతుడై శివుడు వెలసిన నేల శ్రీశైలంలో మరో శివ లింగం బయటపడింది. యాఫి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా పురాతన శివలింగం దర్శనమిచ్చింది. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. శివలింగం పక్కనే రాయిపై కొన్ని గుర్తులతో.. తెలియని లిపితో కొంత రాసి ఉంది.
బయటపడిన శివలింగం వద్దకు జనం వచ్చి దర్శించుకొని పూజలు చేయడం ప్రారంభించారు. పూలు, పండ్లు పెట్టడం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైల దేవస్థాన అధికారులు శివలింగం వద్దకు వచ్చి పరిశీలించారు. పురావస్తు శాఖ అధికారులు చేరుకుని లిపిని ఆర్కియాలజీ ల్యాబ్ కు పంపించారు.