JAISW News Telugu

Kidnapped: రెచ్చిపోయిన యువతి…పెళ్లి చేసుకోవాలంటూ యువకుడిని కిడ్నాప్ చేసిన కిలాడి

హైదరాబాద్ లో మరో యువతి రెచ్చిపోయింది. నిన్న ఓ అమ్మాయి ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఫోటోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేయగా తాజాగా  త్రిష అనే అమ్మాయి ప్రణవ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసింది. మ్యాట్రిమోనీ సైట్లో ప్రణవ్ ఫోటో చూసి ఇష్టపడ్డ ఆమె పెళ్లి చేసుకోవాలంటూ వేధించింది. అతడు ఒప్పుకోకపోవడంతో కిడ్నాప్ చేసి గదిలో బంధించింది. ఎట్టకేలకు తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో త్రిష బండారం బయటపడింది.

పెళ్లికి నిరాకరించడంతోనే అమ్మాయి ఎలాగైన అబ్బాయిని తన దారికి తెచ్చుకోవాలని కిడ్నాప్ చేసి పోలీసులకు చిక్కింది.  సాధారణంగా అబ్బా యిలు అమ్మాయిను కిడ్నాప్ చేయాడాన్ని మనం చూస్తూ ఉంటాం..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. నచ్చిన అబ్బాయి కోసం అమ్మాయిలు కూడా ఎంతకైన తెగిస్తున్నారన్నది ఈ సంఘటన చూస్తే మనకు అర్థం అవుతుంది ..మెత్తం మీద ఇక మీదట అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Exit mobile version