JAISW News Telugu

Allu Arjun Injuries : ‘పుష్ప 2’ షూటింగ్ లో అల్లు అర్జున్ కి తీవ్రమైన గాయాలు..ఆందోళనలో ఫ్యాన్స్!

Allu Arjun Injuries

Allu Arjun Injuries

Allu Arjun Injuries : ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’. 2021 వ సంవత్సరం డిసెంబర్ 17 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ‘పుష్ప ‘ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. పుష్ప సినిమాలో హీరో ఎలా ఎదిగాడు అనేది చూపిస్తే, సీక్వెల్ లో ఎలా ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసాడు, ఎలా రూల్ చేసాడు అనేది చూపించబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15 వ తారీఖున విడుదలయ్యే సినిమా ఎలా ఉంటుందో అని ప్రతీ ఒక్కరిలో ఆత్రుత నెలకొంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి.

మేకర్స్ ఈ లీక్స్ పై చాలా ఫైర్ మీద ఉన్నారు. ఇక రీసెంట్ గా లీక్ అయిన ఫొటోలో అల్లు అర్జున్ ని చూసి అభిమానులు చాలా కంగారు పడ్డారు. దానికి కారణం ఆయన చేతికి గాయం అవ్వడం వల్లే. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మీద జాతర లో జరిగే ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ చెయ్యికి బలమైన గాయం అయ్యింది. ఆయన చేతికి కట్టుకోవడాన్ని చూసిన అభిమానులు, మా హీరో కి ఏమైంది అంటూ పోస్టులు పెడుతూ మేకర్స్ ని ట్యాగ్ చేసారు. ఫైట్ సన్నివేశం జరుగుతున్నప్పుడు చిన్న గాయం అయ్యింది.

రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు అన్నారు. ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అల్లు అర్జున్ సన్నిహిత పీఆర్ టీం చెప్పడం తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇకపోతే ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే జరిగిందట, ఇదే రేంజ్ ఊపుతో ముందుకు పోతే ఆగష్టు 15 వ తారీఖున ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా పుష్ప 2 తో పాటుగా, పుష్ప 3 కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Exit mobile version