Telangana : తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్ పై 15 శాతం, 75-80 ఏళ్ల లోపు వారికి 20 శాతం, 80-85 ఏళ్ల లోపు వారికి 30 శాతం, 90-95 ఏళ్ల లోపు వారికి 50 శాతం, 95-100 ఏళ్ల లోపు వారికి 60 శాతం, 100 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.