Ex Minister Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మంగళవారం తెల్లవారు జామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేస్తోంది. రమేశ్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేశ్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఐడీ జప్తులో ఉన్న భూములను గొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1గా జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, ఏ2గా జోగి రమేశ్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం.