JAISW News Telugu

Fiber Net Case : ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కు  సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం

Fiber Net Case

Fiber Net Case

Fiber Net Case : ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల నుంచి రూ. 114 కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించింది. కేసులో ఉన్న ఏడుగురు నిందితుల నుంచి ఈ మొత్తం వసూలు చేయాలని మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీంతో హోంశాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆస్తుల అటాచ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది.

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఆశ్చర్యం కలిగించింది. టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని కేసు నమోదు చేసింది. ఏ1 గా వేమూరి హరిక్రిష్ణ, ఏ2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ25గా చంద్రబాబు పేర్లను చేర్చింది.

కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల జప్తునకు సీఐడీ రెడీ అయింది.  హోం శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించడం గమనార్హం. ఆస్తుల అటాచ్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు సిద్ధమవుతున్నారు.

తెలుగుదేశం హయాంలో జరిగిన ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో టీడీపీ పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. సీఐడీ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిగింది. విచారణలో చంద్రబాబుతో పాటు మరికొందరిపై సీఐడీ నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశించడంతో రాజకీయ కలకలం రేగుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కుట్రలతో ఆర్థికంగా దెబ్బతీయానలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

Exit mobile version